2025 డిసెంబర్ 04, 05 తేదీ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం, గచ్చిబౌలి లో జరిగిన బాలొత్సవల వేడుకలలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలి సెక్రటరీ పి. ప్రభాకర్ గారు , రంగారెడ్డి జిల్లా విద్యాశాఖా అధికారి (DEO) శ్రీ పి. సుశీంద్రరావు గారు ముఖ్యఅతిథి గా పాల్గొనటం జరిగింది. దాదాపు 49కి పైగా పాఠశాలలు ఈ పోటిలలో పాల్గొని గెలుపొందిన విద్యార్థులు బహుమతులు అందించటం జరిగింది.పిల్లలకు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. విద్యాశాఖా అధికారి పి. సుశీంద్రరావు గారు సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలి ని ఉద్దేశించి పిల్లల కోసం ఏర్పాటు చేసిన బాలొత్సవ వేడుకలు,పేద విద్యార్థుల కోసం ఉచిత ట్యూషన్,పేద ప్రజలకోసం ఉచిత వైద్య శిబిరం క్యాంపులు మరియు ఆన్‌లైన్ 15 వేలకి పైగా పుస్తకాలు ఉచితంగా అందిచటం గురించి మాట్లాడుతూ అభినందించం జరిగింది.